నిజం
ఆ : తల కి ఆ దెబ్బ ఏమిటి ?
అ : ఏమి చెయ్యాలో తెలియక నేలకేసి కొట్టుకున్నా !
ఆ : ఆపు నీ వెటకారం . నిజం చెప్పు
అ : కాలు జారి పడితే బొప్పి గట్టింది .
ఆ : అలా చెప్పు
అ : ఖర్మ రా భగవంతుడా (తనలో తను )
***********************************************************************
బ్రదరోత్సాహం :
తమ్ముడు అన్న తో: "ఛీ, పెద్దవాళ్ళను ఎలా చూసుకోవాలో తెలియదూ ?"
అన్న ఒక చవట , ధేబ్య మొహం వేసుకొని చూస్తున్నాడు !

పంచాయతి :
పెద్ద : ర్రేయ్ , కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా !
ముద్దాయి (దోషి కాదు ) : ఈ మధ్య అన్నం తింటుంటే అరిగి చావడం లేదు . గడ్డే నయమనిపిస్తోంది.
** పెద్ద కి తగలడి పోతోంది **

సద్దిమూట :
పెద్దాయన : వాళ్ళ గురించి నీకు తెలియదు.
బుడ్డోడు : ఊరుకోండి, మీరు మరీ చెప్తారు .
పెద్దాయన : (మౌనం)
కొన్నాళ్ళకి,
బుడ్డోడు : అవును అప్పుడే చెప్పారు (పెద్దాయన కాలం చేశారు )
************************************************************************
చాకిరి :
ఉ : బాస్ , నాకు ఒక రోజు సెలవు కావాలి . (అప్పటికే అన్నపానాదులు మాని పనికే అంకితమయ్యాడు )
బా: hmmm.....
*************************************************************************
కుక్క తోక :
రాత్రి నిద్ర మాని పనిచేస్తుంటే , అకస్మాత్తుగా గుండెల దగ్గర ఏదో uneasy ఫీలింగ్ .
పడుకున్న భార్యని, పిల్లల్ని చూస్తుంటే భయం వేస్తుంది (ఏమయిపోతారో అని)
అప్పటి దాకా తనను మాటల తో చీల్చి చెండాడేసిన యావన్మంధిని క్షమించేసాడు .
రాముడు గుర్తుకువచ్చాడు . పొద్దున్నే లేచి Shoes వేసుకొని , రామదాసు కీర్తనలు వింటూ వాకింగ్ కి బయల్దేరాడు . రెండు రోజుల తరువాత మళ్ళీ అన్నీ మామూలే !
***************************************************************************
జీవితం :
కాలేజీ లో ఉన్నపుడు : ఎందుకు రా అందరూ మోక్షం అంటూ తిరుగుతారు ? ఏం తక్కువ ? మనిషి జీవితానికి ఏమిటి లోటు ? తిన్నామా , enjoy చేసామా ! స్వర్గం లో cricket ఆడతారో ఆడరో ? మోక్షం అంటే ఒక hypothesis. నాట్ ఎట్ ప్రూవ్డ్ ! ఎందుకు రా uncertainity వెనకాల పరుగులు తీస్తారు ? హట్ !నాన్సెన్స్ !
భవసాగరం లో: భగవంతుడా ! మోక్షం ! ప్లీజ్ ! (It is still an hypothesis . కానీ , pathetic reality కన్నానూ , ఆ uncertain hypothesis బావుంటుంది )
*******************************************************************************
ప్లాస్టిక్ పలకరింత :
మొదటి వ్యక్తి : Happy so and so పండగండి !
రెండవ వ్యక్తి : Hey , థాంక్స్ యా ! Same to you !
మొదటి వ్యక్తి (స్వగతం ): వీడి పని బావుంది . ఇంచక్కా పండగ చేసుకుంటున్నాడు .
రెండవ వ్యక్తి (స్వగతం ): నా మొహాని మళ్ళీ పండగ ఒకటి.

కెసిఆర్ మార్కు రాజకీయం :
అయ్యో ! ఇన్నాళ్ళూ నీ చేత చేయించుకొని ఇప్పుడు తరిమేసారు .
ముందు వెనకా ఆలోచించకుండా దుమ్మెత్తి పోద్దాం .
పంచాయతీ పెడదాం .
వాడి బతుకు చిందరవందర చేద్దాం .
హమ్మయ్యా ! చచ్చాడు
(తప్పు లేదు , సర్వైవల్ అఫ్ ద ఫిట్టెస్ట్ )

లోకం :
కర్త వాడి ఖర్మ కాలి , ఒక కర్మ చేసాడు .
అది నచ్చని మొదటి వ్యక్తి , రెండవ వ్యక్తి తో : వాడు వెధవ అహే !
రెండవ వ్యక్తి : అవును సుమీ !
వీడు మూడో వాడితో : వాడు వన్ అండ్ హాఫ్ వెధవండీ !
n to n+1:వాడు n*n*e^n వెధవండీ!

అబద్ధం:ఎదుట వ్యక్తికి తగినట్టుగా , వారి అభిరుచికి సరిపడా వండొచ్చు .
నిజం is so overrated . జనాలు నిప్పు లాంటి నిజం అంటారే కానీ , వాళ్ళకి కూడా అబద్దమే కావాలి .
పనిగట్టుకొని మరీ అబద్దాలు చెప్పేవాళ్ళకి పండగ .
******************************************************************************
మనకి నచ్చని వ్యక్తి ఛస్తూ , ఏడుస్తూ , తల పగిలేలా బాదుకుంటూ నిజం చెప్పినా మనం నమ్మం .
అదే నచ్చిన వ్యక్తి అందం గా అబద్దం చెప్తే , మహా ప్రసాదం .
చెప్పే మనిషే కాదు , Presentation is equally important .
మనకి నచ్చని వ్యక్తి మన ఇంట్లో ఒక చిన్న సంచి పెట్టుకున్నా కూడా ఏదో బరువు మోసేస్తున్నాం అన్న బాధ .
నచ్చిన వాళ్ళ వస్తువులు ప్రియం . అబ్బే అదేమీ పెద్ద అడ్డేమి కాదు

Comments