విశ్వనాద్ ధియేటర్ లో "ఎందుకొచ్చాను రా బాబు" అని కూర్చున్న నాకు ఈ పాట అయ్యేసరికి ఎవరో నా టికెట్ డబ్బులు వడ్డీ తో సహా నా జేబులో పెట్టేసినట్టనిపించింది. సినిమా చూసి ఇంటికి వచ్చిన వెంటనే వెతికి మరీ పాట వినడం చాలా అరుదు. This is one such song. Spotify లో విన్న ప్రతీసారీ, youtube కి పని చెప్పేలాగ Picturization. What a Song! ఇంత మంచి పాటకి దిష్టి తగలకుండా ప్రకాష్ అక్కడక్కడ తెలుగుని ఖూనీ చేసేసాడు. Otherwise, this is a masterpiece. రామజోగయ్య గారు ఎప్పటిలాగే బాగా రాసారు. చిత్ర's rendering is nothing unusual. ఎప్పటిలాగానే "చాలా" బాగా పాడారు. మధ్యలో "ఆలాప్" ఆవిడ తప్ప ఎవరు పాడినా తెలిపోయేదేమో! She is a legend anyways. ఇదంతా ఎందుకు, ఆవిడ ఏది పాడితే అది బావుంటుంది. Infact, అదే బావుంటుంది. ఇదంతా natural. శాస్త్రి గారు బాగా రాస్తారు, ప్రకాష్ బాగా ట్యూన్ చేస్తాడు, చిత్ర గురించి చెప్పనే అక్కర్లేదు. కానీ తమన్నా? Sweet Surprise! ప్రతీ frame ని expression తో elivate చేసింది. 2:59 నుంచి 3:15 వరకు అయితే అద్బుతం. నచ్చలేదా? సరే అయితే 4:39 దగ్గర చూడండి. ఇంకా నచ్చకపోతే, చ...