బొత్తిగా ఖాళీ ఉండటం లేదు . క్షణం తీరిక, దమ్మిడి ఆదాయం సామెత గుర్తుకు వస్తుంది . కిందటి వారం మా అనిల్, శాస్త్రి గారు కంచె లో పాట వినమని మెయిల్ పెడితే (ఈ మధ్య ఫోన్ వాడకం బాగా తగ్గించేసా ) ఇప్పుడు కుదిరింది . ఈ ఆదివారం పూట శాస్త్రి గారు రాసిన "ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో " ఉచ్చు లో పడిపోయాను . "ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళ్ళిపోదా , తనోటి ఉందని మనమెలాగో గమనించం గనుక ". ఏదో తక్కువయింది . ఏమిటో అర్ధం కావడం లేదు. ఆ అబ్బాయి చాలా బాగా పాడాడు కానీ SPB అయితే ఎలావుండేదో ?