ఇవాళ asusual గా current పోయినప్పుడు, పిల్లలకి ఈనాడు పేపర్ తో గాలి విసురుతూ (విసినికర్ర రోజులు పోయాయి ) , యేసుదాస్ పాడిన "బంటు రీతి కొలువు " పాట వింటూ ఉండగా ఒక విషయం అర్ధం అయ్యింది. ఈ Power cuts మన culture లో భాగమే అని ! ఎలా అంటారా ?
చిన్నప్పుడు వేసవి సెలవుల్లో కరెంటు పోతే వీధి వీధంతా వచ్చి అరుగుల మీద వాలిపోయేది . పిల్లలు రకరకాల ఆటలు ఆడేవాళ్ళు . పెద్దలు సోది కి అంతే ఉండేది కాదు . రాజకీయాలు, సినిమాలు, టీవీ లో సీరియల్స్ , గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ , రూమర్స్ , గోస్సిప్స్ ఒకటేమిటి మళ్ళీ కరెంటు వచ్చేదాకా అన్నిటిని విశ్లేషించేవారు . అరుగుల మీద జరిగే వాదనలు/వాదులాటలు మన ఇప్పటి టీవీ షో లో చర్చలకి ఏమీ తీసిపోవు . అప్పుడప్పుడు ఈ వాదనలు శ్రుతిమించి కొన్ని బూతులు కూడా దొర్లేవి . ఆ time లో అక్కడే ఉన్న పెద్దవాళ్ళు ఉన్నపళ్ళాన తిట్టేసి,లోపలకి పంపేసేవారు (ఎక్కడ ఆ భాష మాకు అబ్భేస్తుందో అని భయపడి !!) ఏముంది ఇంక అన్నీ మూసుకొని ఇంట్లో కి వచ్చి కూర్చోనేవాళ్ళం . బాగా ఆడి వస్తామేమో , దాహం వేస్తుంది . అలాగే direct గా వెళ్లి కుండ లో glass ముంచేసేవాళ్ళం . అప్పుడు విన్పించేది ఒక అరుపు! మా మామ్మ! (ఈవిడ మా అమ్మమ్మ తల్లి ). ఆ చమటలో, ఉక్కబోతలో ఏమి చెయ్యాలో తెలియక వెర్రి చూపులు చూస్తూ ఉంటే , మా అమ్మమ్మ విసిన కర్ర తో విసురుతూ పాటలు పాడేది . ఆవిడ ఎలాగో విసురుతోంది కాబట్టి తెలివిగా ఆవిడ పక్కన వాలిపోయేవాళ్ళం .ఇంక అప్పటి నుంచి ఏమీ మాట్లాడకుండా పాటలు వినేవాళ్ళం . ఎక్కడ మాట్లాడితే పాట ఆగుతుందో, తద్వారా విసిన కర్ర ఆగుతుందో అని భయం ! ఈ భయం వల్ల జరిగిన ఉపకారాలు రెండు . ఒకటి, ఆ రోజు రాత్రికి నిద్ర పట్టడం . రెండోది , తెలియకుండా ఆ పాటకి addict అవ్వడం . ఇవాళ అదే భయం మా అమ్మాయిలో చూసాను . నేను ఏసుదాస్ పాడిన త్యాగ రాజ కీర్తన వింటూ, చేతిలో ఉన్న పేపర్ తో గాలి విసురుకుంటుంటే , అది ఏమి మాట్లాడకుండా పక్కన పడుకొని నెమ్మది గా నిద్రలోకి వెళ్లిపోయింది . ఇలాంటి పవర్ కట్స్ ఇంకో వారం రోజులుంటే , నేను రోజూ అదే పాట వింటూ గాలి విసిరితే... ఏమో .... గుఱ్ఱం ఎగరావచ్చు !
ఇంక రెండో రకం discussions: ఇవి అరుగుల మీద కాకుండా ఇంట్లో వసారా లో జరిగేవి . ఈ కార్యక్రమం లో వక్తలు ఇంట్లో సభ్యులు మాత్రమే ! దీని ఎజెండా చుట్టాల గురించి మాట్లాడుకోవడం, పంటల గురించి మాట్లాడుకోవడం . ఫలానా వాడు బాగా చదువుకుంటున్నాడు ట ! ఫలానా వాడు తాగి తిరుగుతున్నాడు ట ! వీటివళ్ల జరిగే ఉపయోగం ఏది మంచో ఏది చెడో తెలియడం ! తెలుస్తోంది కదా అని ఎవడైనా కుర్రకుంక మధ్యలో మాట్లాడితే , అక్కడ వక్తలందరూ ఆ సదరు కుర్రాడి మీద ముప్పేట దాడి చేస్తారు . (చదువు లేదు కానీ , వయసుకు మించిన మాటలు .. వగైరా, వగైరా ...)
ఇవి ఆ రోజుల్లో ! ఈ రోజుల్లో , పవర్ పోయిన వెంటనే Invertor ఆన్ అవుతుంది .మొగుడు ఆఫీసు పని కి లాగిన్ అవుతాడు . పిల్లలు Chota Bheem పెట్టేసుకుంటారు . భార్య కిచెన్ లో పని చేసేసుకుంటుంది .
ఆ రోజుల్లో కరెంటు పోతే వీధి లో అందరూ ఒకచోటకి వచ్చేవారు . మరి ఇప్పుడు ?? మా ఇంటి పక్క Apartment లో ఎవరుంటారో కూడా తెలియదు . అంతవరకు ఎందుకు ? నేను రేపు Invertor కొంటే , కరెంటు పోయినప్పుడు మేమే ఒక చోటకి వస్తామో రామో !

Comments